గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అతని అనుచరులు రురల్ సిఐ అచ్చయ్య సహకారంతో తన రెండున్నర ఎకరాల సుబాబుల్ తోటను పూర్తిగా ధ్వంసం చేసారని వైసీపీ మాజీ మండల ప్రసిడెంట్ శంకర్ యాదవ్ ఆరోపించారు. దీనివల్ల తనకు ఐదులక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయాడు. తనకు న్యాయం చెయ్యాలని కోరుతూ సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేశారు.