ఉత్తర భారతదేశంలో జలమయమైన పలుప్రాంతాలు

Update: 2020-07-27 14:44 GMT

దేశంలో కరోనాకు తోడు పలు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుంది. సోమవారం ఉదయం నుంచి ముంబైలోని ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు రహదారుల్లో ట్రాపిక్ జామ్ అయ్యాయి. అటు ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరభారత దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ వారంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. జూలై 26 నుంచి 28 మధ్య ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బీహార్‌ల‌లో, జూలై 27-29 మ‌ధ్య పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్‌లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, బీహార్‌లోని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 10 లక్షలకు మందికి పైగా జ‌నం ఆశ్రయం కోల్పోయారు.

Similar News