గత నెలలో 59 చైనా యాప్ లను నిషేధించిన భారత ప్రభుత్వం , తాజాగా మరో 47 చైనా యాప్ లను నిషేధించాలని నిర్ణయించింది. ఇంతకుముందు నిషేధించిన యాప్‌లు క్లోన్‌లుగా ఈ 47 పనిచేస్తున్నాయని కనుగొన్నది. భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన 47 చైనా యాప్ ల జాబితా త్వరలో విడుదల కానుంది. అయితే ఇందులో పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్‌జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయిన టిక్‌టాక్, హెలో లాంటి 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.