భారత్ లో 14 లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-27 04:56 GMT

భారతదేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,931 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం 14 లక్షలు దాటింది, అనేక రాష్ట్రాలు రోజువారీ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన బులెటిన్ ప్రకారం భారతదేశం యొక్క కోవిడ్ -19 సంఖ్య 14,35,453 గా ఉంది, అలాగే గడిచిన 24 గంటల్లో 708 మరణాలు చోటుచేసుకోవడంతో కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,85,114 యాక్టివ్‌ కేసులుండగా, మహమ్మారి నుంచి 9,17,568 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది.

Similar News