రాజీనామా చేసే ప్రసక్తే లేదు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

Update: 2020-07-26 23:33 GMT

వైసీపీ ఎంపీలు తనపై వేసిన అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. మంత్రి అవంతి శ్రీనివాస్ తనను ఎందుకు రాజీనామా చెయ్యాలని కోరుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తన అనర్హత పిటిషన్ చెల్లదని వారికి అర్ధమయ్యే ఇప్పుడు రాజీనామా డిమాండ్ లేవనెత్తుతున్నారని అభిప్రాయపడ్డారు.

పార్టీకి, ముఖ్యమంత్రికి తాను విధేయుడిగా ఉన్నందున ఐదు సంవత్సరాల కాలం ముగిసే వరకూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ఇక విశాఖలో నలంద కిషోర్ మృతికి ఖచ్చితంగా పోలీసులే కారణమని, కరోనా ప్రమాదం ఉందని తెలిసినా ఆయన్ను కర్నూల్ కు ఎందుకు తీసుకువెళ్లారని ప్రశ్నించారు రఘురామకృష్ణంరాజు.

Similar News