తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కేంద్ర బ్యాంకు బ్రాంచిలో పని చేస్తున్న దాదాపు 38 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు గుర్తించారు. బ్యాంకు ఉద్యోగులకు సామూహిక పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రాంచిలో పని చేసే సగానికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు తెలుసుకున్నారు. అనంతరం బ్యాంకును శానిటైజ్ చేశారు. గతంలో బ్రాంచికి చెందిన ఓ అధికారి కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దేశంలో మహారాష్ట్ర తరువాత కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నది తమిళనాడు రాష్ట్రంలోనే. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 2.06 లక్షల మంది అని గణాంకాలు చెబుతున్నాయి.