బీజేపీ ఎమ్మెల్యేను సతీసమేతంగా 'టీ' కి ఆహ్వానించిన ప్రియాంక

Update: 2020-07-27 11:57 GMT

గతంలో తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే ముందు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీజేపీ ఎమ్మెల్యే అనిల్‌ బలూనీని సతీసమేతంగా టీ కోసం ఆహ్వానించారు. అయితే ప్రియాంక ఆహ్వానంపై ఎమ్మెల్యే ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రియాంక గాంధీ 1997 నుండి 35 లోధి స్టేట్ బంగ్లాలో ఉంటున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పిజి) రక్షణను ఉపసంహరించుకున్న తరువాత ఇంటిని ఖాళీ చేయమని

కాంగ్రెస్ నాయకురాలికి గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసు ఇచ్చింది. జూలై 1 నుంచి ఆమె కేటాయింపులు రద్దయ్యాయని పేర్కొంటూ ప్రభుత్వ నోటీసుతో ఆగస్టు 1 లోగా ఖాళీ చేయాలని ఆమెను కోరింది. ఈ ఇంటిని బీజేపీ ఎమ్మెల్యే అనిల్‌ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే.. దీంతో లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు ప్రియాంక తన మకాం మార్చనున్నారు.

Similar News