గవర్నర్‌పై మోదీకి ఫిర్యాదు చేసిన రాజస్థాన్ సీఎం

Update: 2020-07-27 18:21 GMT

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. రాజస్థాన్ రాజకీయంలో కేంద్రం కలుగుజేసుకొని ప్రభుత్వాన్ని కాపాడాలని కోరారు. కరోనా పరిస్థితుల పై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం.. గవర్నర్‌ను కోరిన సంగతి తెలిసిందే. అయితే, గవర్నర్ మాత్రం ఈ అభ్యర్థనను వెనక్కు పంపారు. దీంతో గవర్నర్‌ తీరుపై గెహ్లాత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు తెలియజేసేందుకు అశోక్ గెహ్లాట్.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. గవర్నర్ వ్యవహార శైలి ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేదని అన్నారు. మంత్రివర్గ తీర్మానానికి వ్యతిరేకంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ స్పందించకపోతే.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని.. కనుక, కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ప్రభుత్వాన్ని కాపాడాలని కోరారు. తన రాజకీయ ప్రయాణంలో ఈ విధంగా వ్యవహరించే గవర్నర్ ను ఇప్పటి వరకూ చూడలేదని అన్నారు. మరోవైపు రాజస్థాన్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేపై అసెంబ్లీ స్పీకర్‌ పీసీ జోషీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు.

Similar News