శనివారం రాత్రి భారీ వర్షాల కారణంగా, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్కా-సిమ్లా జాతీయ రహదారి 5 మీద.. తంబు బెండ్ సమీపంలో రోడ్డు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రదేశం చండీగర్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది. రోడ్డు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. కల్కా-సిమ్లా నేషనల్ హై-వే 5లోని పర్వానూ నుండి చంబాఘాట్ వరకు వెళ్లే రహదారిపై ఫోర్‌లైన్ పనులు దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. సోలన్ నుండి పర్వానూ వరకు చాలా చోట్ల ఈ పని పూర్తయింది, అయితే కొండచరియలు విరిగిపడటం, వర్షాకాలంలో రహదారి మునిగిపోవడం వల్ల సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి.