అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కానుక ఇస్తా : మొఘల్‌ వారసుడు

Update: 2020-07-27 13:22 GMT

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మొఘల్‌ వారసుడు కానుక ఇస్తానని ప్రకటించారు. ప్రధాని అనుమతిస్తే ఆయనను కలిసి ఆలయ నిర్మాణానికి కిలో బరువున్న బంగారు ఇటుకను ఇస్తానని మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ అన్నారు. దీనిని అయోధ్య రామాలయం నిర్మాణానికి ఉపయోగించాలని ఆయాన అన్నారు.

కాగా మొఘలుల వారసుడిగా చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరం తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆగస్టు ఐదవ తేదీన భూమిపూజ జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేస్తారని అయోధ్య ట్రస్ట్ తెలిపింది.

Similar News