పొట్టలో కత్తి.. డాక్టర్లు షాక్

Update: 2020-07-27 18:43 GMT

కత్తిని మింగిన ఆ యువకుడిని చూసి చికిత్స చేసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. డ్రగ్స్‌కి బానిసైన 28 ఏళ్ల యువకుడు లాక్ డౌన్ కారణంగా అవి దొరక్కపోవడంతో పిచ్చెక్కినట్లయింది. ఏం చేస్తున్నాడో అతడికే తెలియలేదు. దాంతో అక్కడే ఉన్న కత్తిని మింగేశాడు. ఆ విషయం కూడా మర్చిపోయాడు. కొన్ని రోజులైన తరువాత తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో జాయినయ్యాడు. వైద్యులు చికిత్స నిమిత్తం ఎక్స్ రే తీయగా పొట్టలో 28 సెంటీమీటర్ల కత్తి ఉన్నట్లు గుర్తించారు. ఈ అరుదైన కేసును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రస్తుతం యువకుని పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువకునికి మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి 20 సెంటీమీటర్ల కత్తిని మింగి ప్రాణాలతో బయటపడడం ఇదే మొదటికేసని వెల్లడించారు. ఇప్పటిదాకా సూది, పిన్ లాంటి చిన్న వస్తువులు మింగిన వారిని చూశాం కానీ 20 సెంటీమీటర్ల కత్తి ఎక్స్‌రేలో చూసి షాకయ్యాం అని వివరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ దాస్ తెలిపారు.

Similar News