కరోనా కాటుకు బలైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

Update: 2020-07-28 10:00 GMT

కరోనా కాటుకు కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు బలయ్యారు. మాజీ మంత్రి రాజా మదంగోపాల్ నాయక్ సోమవారం చికిత్స పొందుతూ మరణించారు. గత వారం కరోనా సోకినప్పటి నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గత రెండు రోజులుగా ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఆయన మరణించారు. అయన డయాబెటిస్ పేషంట్ గా ఉన్నట్టు సమాచారం. కాగా మదంగోపాల్ నాయ 1983, 1985 మరియు 1989 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో షోరపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

Similar News