హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 955 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 2,187కి చేరింది. వీరిలో 1,203 మంది చికిత్స తీసుకొని కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌కు సుమారు 15 మంది కరోనా రోగులు వలస వచ్చినట్లు అధికారులు గుర్తించారు.