ఏపీలో ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు

Update: 2020-07-27 19:36 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షలు చేయడానికి ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది. పరీక్షలకు ఎంత వసూలు చేయాలనే ధరలను కూడా నిర్ణయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలకు రూ. 750 మించి వసూలు చేయొద్దని తెలిపింది. ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే పరీక్షకు 2800 ధరను ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్‌ల్లో పరీక్షలకు వసూలు చేస్తున్న ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.

Similar News