ఏపీలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-27 20:11 GMT

ఏపీలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసుల్లో ప్రతి రోజూ రికార్డులు బద్దలవుతున్నాయి. కరోనా పరీక్షలు భారీగా చేస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,02,349 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం 49,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం1,02,349 పాజిటివ్ కేసులకు గాను 49558 మంది డిశ్చార్జ్ కాగా, 51701 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1090 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News