ఉత్తరప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,578 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం 1,192 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 42,833 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 1,456కు చేరింది. ప్రస్తుతం 26,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి.