కరోనా ఎఫెక్ట్: మూతపడుతున్న విద్యాసంస్థలు

Update: 2020-07-28 14:30 GMT

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కరోనా.. విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకొని వస్తుంది. చాలా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులను కూడా ప్రారంభించాయి. ఈ కరోనా మహమ్మారి వలన చాలా విద్యాసంస్థలు మూతపడుతున్నాయి కూడా. ఈ కరోనా సంక్షోభం వల్ల ఉద్యోగ అవకాశాలు లేనందువల్ల 2020-21వ విద్యా సంవత్సరంలో దేశంలోని 179 ప్రొఫెషనల్, ఇంజినీరింగ్, బిజినెస్ స్కూళ్లను మూసివేయాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. ఈ మహమ్మారి ప్రభావం ఉన్నత విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో కొత్త సంస్థలు అనుమతి లభించకపోవడమే కాకుండా.. చాలా సంస్థలు మూతపడ్డాయి. దేశంలోనే మూసివేసిన కళాశాలల సంఖ్య గత 9 ఏళ్లలో అత్యధికమని ఏఐసీటీఈ వెల్లడించింది. 2019లో 92 విద్యాసంస్థలు, 2018లో 89 విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ విద్యాసంవత్సరంలో 762 విద్యాసంస్థలు కొన్ని కోర్సులను మూసివేశాయి.

Similar News