ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం (సీఏఎఫ్) జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం జిల్లా జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. కరియమెట ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కరియమెట ప్రాంతం.. సీఏఎఫ్ 22 బెటాలియన్ క్యాంప్ ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. శిబిరంపై నక్సల్స్ కాల్పులు జరిపి పారిపోయారు.