రోగనిరోధక శక్తికి విటమిన్ బి12..

Update: 2020-07-28 15:09 GMT

కరోనా వైరస్ కట్టడికి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. విటమిన్ సి, డి, జింక్ లతో పాటు విటమిన్ బి కూడా అధికంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. మరి విటమిన్ బి12.. ఏ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందో తెలుసుకుందాము..

వాల్నట్, రాగి, కందిపప్పు, వేరుశనగ, అరటి, గోధుమపిండి వంటి పదార్థాల్లో ఉంటుంది. కణాల ఆరోగ్యానికి, ఎర్ర రక్త కణాల పెరుగుదలకు, కంటి చూపుకు,జీర్ణక్రియ, మెదడు, గుండె పని తీరులను మెరుగుపరుస్తుంది.

వాల్‌నట్స్ : ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎల్‌డిఎల్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రాగి: ఇందులో తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్, అధిక డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉన్న కాల్షియం, ఇనుము రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కందిపప్పు: ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉన్నాయి. క్లినికల్ డయాబెటిస్ లో 2015 అధ్యయనం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సూచించింది.

వేరుశనగ: ఇందులో ఉన్న ప్రొటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. వేరుశనగ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుందని మాస్టిక్ట్ విశ్వవిధ్యాలయం అధ్యయనం వెల్లడించింది.

అరటి: నీరు, కార్బోహైడ్రేట్లు అరటిలో ఎక్కువగా ఉంటాయి. అరటిలోని పెక్టిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

గోధుమపిండి: శరీరంలోని పోషక లోపాలను నివారిస్తుంది. ఇందులోని ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 రక్తం ఏర్పడడానికి సహాయపడుతుంది.

Similar News