24 గంటల్లో 47,704 మందికి కరోనా..

Update: 2020-07-28 11:45 GMT

భారతదేశంలో గత 24 గంటల్లో 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, అలాగే 654 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఇప్పుడు 14,83,157 కు చేరింది. ఇందులో రికవరీలు 9,52,744 ఉన్నాయి. యాక్టీవ్ కేసులు 4,96,988 ఉన్నాయి. మార్చి నుంచి 33,425 మంది కోవిడ్ -19 తో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారంలో ఉంది. ఇక కరోనావైరస్ రోగులలో రికవరీ రేటు 64.23 శాతానికి పెరిగింది. రికవరీ / మరణాల నిష్పత్తి 96.6%: 3.4% అని భారత ప్రభుత్వం తెలిపింది.

Similar News