టీడీపీ నేత నారాలోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఓటేసిన పేదలు అనారోగ్యానికి గురైతే.. చెత్తంబండిలో ఆస్పత్రులకు తీసుకువెళ్తారా? కానీ, అధికారంలో ఉన్న పెద్దలకి కరోనా సోకితే ప్రత్యేక విమానాల్లో పక్క రాష్ట్రాలకు కార్పోరేట్ ఆస్పత్రులకు తీసుకు వెళ్తారా.. ఇదేం పాలన అంటూ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంబులెన్స్‌కి కాల్ చేసినా స్పందించకపోవడంతో.. చెత్తబండిలో అనారోగ్యానికి గురైన వ్యక్తిని తరలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ అంబులెన్స్ అయితే రియాలిటీ చెత్తబండి అయిందని లోకేష్ తప్పుబట్టారు.