బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్
రాజస్థాన్ లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు మద్దతు పలకడాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిన్నటి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ హైకోర్టులో రెండవసారి పిటిషన్ దాఖలు చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి 4 నెలల క్రితం స్పీకర్ సిపి జోషికి ఫిర్యాదు చేశానని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని దిలావర్ పిటిషన్ లో పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో ఎన్నికల ఫలితాల తరువాత 6 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇచ్చారని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బిఎస్‌పికి హాని కలిగించేలా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఏకపక్షంగా కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారని అన్నారు. అవసరమైతే ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళతామని ఆమె అన్నారు.