శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

Update: 2020-07-28 08:24 GMT

ఎగువనుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంది. జూరాల నుంచి వస్తున్న వరదకు రోజురోజు రిజర్వాయర్ నీటి మట్టం పెరుగుతోంది. జూరాల నుంచి సోమవారం సాయంత్రానికి 72,098 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. అయితే ఇది ఆదివారం సాయంత్రం ఇంకా ఎక్కువగానే ఉంది. సోమవారానికి తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షపాతం తగ్గడం వలన నదిలో వరద ప్రవాహం తగ్గడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రాజెక్టులో 854.2 అడుగుల్లో 89.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు సామర్ధ్యం మొత్తం 215 టీఎంసీలు. ఎడమ గట్టు కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 43,105 క్యూసెక్కులను తెలంగాణ జెన్‌కో దిగువకు విడుదల చేస్తోంది. దీంతో నాగార్జున సాగర్‌లోకి 42,378 క్యూసెక్కులు చేరుతున్నాయి. నాగార్జున సాగర్ లో నీటి నిల్వ సామర్ధ్యం 315 టీఎంసీలు కాగా ప్రస్తుతం 192.10 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.

Similar News