కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూలై 30 న పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. పార్టీ రాజ్యసభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్సింగ్‌లో ఆమె పాల్గొంటారు. ఇందులో కరోనా అంటువ్యాధితో పాటు దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని.. దీనికి వ్యతిరేకంగా స్పీక్ అప్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఆన్‌లైన్ ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ ప్రారంభించింది.