ఏపీలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,402కి చేరుకున్నాయి. కాగా.. ఇందులో 49,745 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మరో 56,509 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనా కాటుకి గురై 58 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 1148కి చేరాయి.