పాకిస్థాన్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీస్ కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున దుండగులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దుండగుల కాల్పుల్లో ఐదుగురు పోలీస్ కమాండోలు మృతిచెందగా మరో పోలీస్ గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు.