అస్సాంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. వరద బీభత్సానికి 5305 గ్రామాల్లో వందలాది ఇళ్లు నీటమునిగాయి. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం 615 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. దాదాపు 1.5 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. 25 వేల మంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 103 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో భారీగా వరద నీరు రావడంతో వందలాది వన్యప్రాణాలు మృత్యువాత పడ్డాయి.