బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు ఇటీవల కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నటి స్పందిం చలేదు. కానీ రెండు రోజుల తర్వాత న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. మరోవైపు తామే జరిపామని గోల్టి బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కాల్పులు ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పని చేస్తుంది. కాల్పుల ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. దిశా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. కాల్పులకు పా ల్పడిన వారిని ఎక్కడున్నా పట్టుకొని తీరుతామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీశ్ వెల్లడించారు.