Rajnath Singh : తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. హాజరైన రాజ్‌నాథ్ సింగ్..

Update: 2025-09-17 07:00 GMT

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్థూపంతో పాటు, సైనిక అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు పులువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

Tags:    

Similar News