కేరళలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 48 గంటల పాటు వర్షం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ బుధవారం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
ఇక ఎర్నాకుళం జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీరు నిలిచిపోవడం వల్ల కొచ్చి నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొట్టాయం రైల్వే స్టేషన్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రైల్వే ట్రాక్ క్లియర్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.