అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 3న జరిగే రాఖీ పండుగను దృష్టిలో ఉంచుకుని వారణాసి హస్త కళాకారిణులు వినూత్నంగా ఆలోచించారు. జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఎక్స్‌పర్ట్ పద్మశ్రీ రజనీకాంత్ సహకారంతో చెక్కతో రాఖీలు తయారు చేశారు. ఈ సరికొత్త రాఖీలను పీఎం మోదీకి, గాల్వన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత దేశం కోసం అహరహం శ్రమిస్తున్న భారత సైనికులకు పంపించారు.