ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్.. భారత్‌కు మరోసారి చేయూతనిస్తుంది. భారత్‌లో కరోనా కట్టడికి మూడు మిలియన్ డాలర్ల గ్రాంటు మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ నిధులను ఆసియా పసిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద భారత్‌కు అందించనుంది. ఈ నిధులను వైరస్ బాధితులను గుర్తించి వారికి త్వరితగతిన చికిత్స అందిచడం కోసం కేటాయించాలని సూచించింది. లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికి త్వరగా పరీక్షలు జరిపాలని తెలిపింది. గత ఏప్రిల్‌లోనూ కొవిడ్ కట్టడి నిమిత్తం 1.5 బిలియన్ డాలర్లును విడుదల చేసింది. ఏడీబీ సభ్య దేశాల్లో కరోనా వైరస్ నివారణ, కట్టడి కోసం ఏప్రిల్ 13న 20 బిలియన్ డాలర్లతో ‘కొవిడ్-19 పాండెమిక్ రెస్పాన్స్ ఆప్షన్’(సీపీఆర్‌వో) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.