అన్న ఆస్తులు పెరుగుతుంటే. తమ్ముడు ఆఫీసు జప్తు

Update: 2020-07-30 10:34 GMT

దేశీయ కార్పొరేట్ రంగంలో ముఖేష్ అంబానీ సరికొత్త రికార్డులు స్రుష్టిస్తున్నారు. దేశంలో నెంబర్ వన్ కుబేరుడు.. ప్రపంచంలో టాప్ 5లో చోటు సంపాదించాడు. ఆయన ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్న సంపద అలా పెరుగుతుంటే... తమ్ముడి ఆస్తులు కరుగుతున్నాయి.చివరకు కార్యాలయం కూడా యస్ బ్యాంక్ సీజ్ చేసేందుకు రెడీ అయింది. ముంబైలోని శాంతాక్రజ్లోని అనీల్ అంబానీకి చెందిన రియలన్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు.. మరో రెండు ఆఫీసులు జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చింది యస్ బ్యాంక్. రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.2892 కోట్ల రుణం రీపేమెంట్ చేయడంలో విఫలమైంది. అందుకే కంపెనీల ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయిం తీసుకుంది బ్యాంక్. శాంతాక్రజ్ లోని ప్రధాన కార్యాలయం 21,432 చదరపు అడుగుల స్థలంలో ఉంది. అత్యంత విలువైన ఈ భవనంతో పాటు.. మరో రెండు ఆఫీసులను కూడా సీజ్ చేయనుంది. గత కొంతకాలంగా అనిల్ అంబానీ కంపెనీ కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇందుకోసం అప్పులుచేసింది. కానీ ఏ కంపెనీ కూడా క్యాష్ ఫ్లో తీసుకరాలేకపోయింది. దీంతో బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోయాయి. యస్ బ్యాంకు వద్దే వేల కోట్ల రుణాలు తీసుకుంది. బ్యాంకు కూడా నష్టాలతో తీవ్ర సంక్షోభంలో పడింది. దీంతో బాడ్ లోన్స్ రికవరీపై ద్రుష్టిపెట్టింది. మే12లోగా బాకీలు తీర్చాలని రిలయన్స్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. అయినా ఫెయిల్ అవడంతో సెక్యూరిటైజేషన్ అండ్ రీ కన్ స్ట్రక్షన్ ఆఫ్ పైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 కింద సీజ్ నోటిస్ ఇచ్చింది.

Similar News