కర్ణాటకలో కొత్తగా 5,503 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-30 08:36 GMT

కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా బుధవారం కొత్తగా 5,503 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒకే రోజు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తం 1,12,504కు చేరింద. ఇందులో 67,448 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 42,901 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌తో మొత్తం 2,155 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News