ఆగస్టు 14న రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు

Update: 2020-07-30 08:24 GMT

రాజస్థాన్‌లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాజస్థాన్ అసెంబ్లీని సమావేశపర్చాలంటూ సర్కార్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్ర గవర్నర్‌ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఆగస్టు 14న శాసనసభను సమావేశపర్చాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర కేబినెట్..‌ గవర్నర్ కల్‌రాజ్‌ మిశ్రా‌కు నాలుగోసారి ప్రతిపాదనను పంపింది. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పని పక్షంలో 21 రోజుల ముందుగా నోటీసు కోరవచ్చన్న గవర్నర్‌ సూచనల మేరకే తాజా ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో మిశ్రా అసెంబ్లీని సమావేశపరిచేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశపరుచనున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు బుధవారం తెలిపాయి.

Similar News