పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా మృతి చెందారు. 78 ఏళ్ల సోమెన్ మిత్రా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని సిటీ హాస్పిటల్ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సోమెన్ మిత్రా తుదిశ్వాస విడిచారు.
కిడ్ని, గుండె సంబంధిత సమస్యలతో సోమెన్ మిత్రా కొన్ని రోజుల క్రితం హాస్పిటల్‌లో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం తెల్లవారుజామున గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. సోమెన్ మిత్రాకు భార్య, కొడుకు ఉన్నారు.