బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆడిటింగ్ సంస్థలు. S.R. బాట్లిబోయ్ మరియు అసోసియేట్ Llp ఆడిటింగ్ సంస్థలు తాజాగా కంపెనీ పరిస్థితులను, ఆర్ధిక స్థితిగతులను వెల్లడించాయి. ఎయిర్ లైన్స్ ఎప్పుడూ లేని విధంగా హయ్యస్ట్ నష్టాలు చవిచూసింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 807.07 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. ఇదే సమయానికి గత ఏడాది కంపెనీ 56.29 కోట్ల లాభాలను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ ముందుకుసాగడంపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. జనవరి-మార్చి 2019 మధ్య 2571.83 కోట్ల ఆదాయం చూపించింది. మొత్తం గత ఏడాదిలో నష్టాలు 934.76 కోట్లు. గత కొంతకాలంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. 2020-22 మధ్య లక్షా 30వేల కోట్ల లాస్ ఉంటుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు ఎన్ని మిగులుతాయో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ తగ్గకపోవడంతో ఎయిర్ లైన్స్ ఫ్యూచర్ అంధకారంగా మారింది. అటు స్పైస్ జెట్ వంటి సంస్థలే తీవ్రనష్టాల్లో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కంపెనీలో మళ్లీ కీలక వ్యక్తులు బయటకు వెళ్లడం మొదలైంది. ఇప్పటికే CFO కిరణ్ కోటేశ్వరరావు కంపెనీ వీడుతున్నారు. ఆగస్టు 31 తర్వాత కంపెనీ నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు.