కేంద్ర సర్కార్ అన్‌లాక్ 3 మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుకానున్నాయి. అన్‌లాక్ 3 లో భాగంగా రాత్రి సమయాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా, కోచింగ్ సంస్థలు ఆగస్టు 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. మెట్రో రైళ్లు నడపడంపై నిషేధం కొనసాగుతుంది.
సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్‌లు తెరిచి ఉంచడానికి అనుమతించబోమని మార్గదర్శకాలలో పేర్కొంది. అయితే, యోగా ఇన్స్టిట్యూట్స్, జిమ్‌లు ఆగస్టు 5 నుంచి పనిచేయడానికి అనుమతించారు. దీని కోసం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ త్వరలో జారీ చేయనున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు, ఎట్ హోమ్ ఫంక్షన్లను భౌతిక దూర నిబంధనలను అనుసరించి నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఆగస్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో అమలులో ఉంటాయి.