ఏపీలో కరోనా టెస్టులపై బోగస్ లెక్కలు : చంద్రబాబు

Update: 2020-07-31 11:41 GMT

కరోనా టెస్టులపై బోగస్ లెక్కలతో జగన్ సర్కార్ మోసం చేస్తోందని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రతిరోజూ 10 లక్షల మంది జనాభాకు 140కి పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని జగన్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

దీనికి సంబంధించి కేంద్రం ప్రకటించిన జాబితాను ఆయన ట్విట్టర్ లో జత చేశారు. మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బుధ, గురువారాల్లో ఏకంగా 10వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు 70వేలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు జగన్ సర్కార్ చెబుతోంది.

Similar News