మహారాష్ట్రలో కరోనా ఇటీవల తగ్గుముఖం తగ్గినట్టు కనిపించింది. అయితే, గురువారం మళ్లీ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 11,147 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 4,11,798కి చేరింది. అటు, కరోనా మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 266 మంది కరోనా వల్ల మరణించినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో 2,48,615 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 1,48,150 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.