యూపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 3,705 కేసులు

Update: 2020-07-30 20:11 GMT

యూపీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య పెరుగుతుంది.. తప్ప తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,705 కేసులు నమోదవయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 81,000కి చేరిందని యూపీ ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, గురువారం ఒక్కరోజే, 57మంది కరోనాతో మరణించగా.. కరోనా మృతుల సంఖ్య 1,587కి చేరింది. ఇప్పటి వరకూ 46,803 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 32,649 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News