భారత్ లో బంగారం డిమాండ్‌ ఢమాల్..

Update: 2020-07-31 07:32 GMT

అధిక ధరలు, కోవిడ్ సంక్షోభం దృష్ట్యా భారత్ లో పసిడి డిమాండ్‌ ఏప్రిల్‌–జూన్‌ మధ్య 70 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. పెట్టుబడి కేటగిరీలో, ఏప్రిల్-జూన్ కాలంలో నాణేల డిమాండ్ 32 శాతం తగ్గి 148.8 టన్నులకు చేరుకుంది. ఇది 2019 క్యూ 2 లో 218.9 టన్నులు గా ఉంది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, పసుపు లోహానికి ప్రపంచ డిమాండ్ 11% తగ్గింది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ బంగారం డిమాండ్ 63.7 టన్నులకు కుదించుకుపోయింది, గత ఏడాది ఇదే సమయంలో 213.2 టన్నులతో పోలిస్తే

ఈ ఏడాది 70 శాతం తగ్గింది. ఇది 11 సంవత్సరాల కనిష్ట స్థాయి అని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యుజిసి) తెలిపింది. 2009 జనవరి నుండి మార్చి త్రైమాసికంలో 64 టన్నులు గా ఉంది. ఆ తరువాత అత్యధిక క్షీణత 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కావడం విశేషం. ఇక డిమాండ్‌ విలువ విషయానికి వస్తే, 57 శాతం పతనమై రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు క్షీణించింది.

2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 168.6 టన్నులతో పోలిస్తే భారతదేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 74% తగ్గి 44 టన్నులకు చేరుకుంది. ఆభరణాల డిమాండ్ రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 44.5 టన్నులతో పోల్చితే ఈ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ 19.8 టన్నులు గా ఉంది.. అంటే 56% తగ్గుదల నమోదయింది.

విలువ పరంగా బంగారు పెట్టుబడి డిమాండ్ రూ. 8,250 కోట్లు ఉంది.. ఇక్కడ 37% తగ్గింది. మొత్తం బంగారం రీసైకిల్ 13.8 టన్నులుగా నమోదయింది, ఇందులో కూడా భారీగా 64% తగ్గింది. ఈ త్రైమాసికంలో మొత్తం బంగారు దిగుమతులు 11.6 టన్నులుగా వున్నాయి, అయితే గతేడాది తో పోలిస్తే 95% తగ్గింది. గతేడాది 247.4 టన్నులుగా ఉంది. ఇక బంగారం డిమాండ్ తగ్గుదల గురించి ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం ఒక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో లాక్డౌన్లు మరియు అధిక ధరల కారణంగా భారత బంగారు డిమాండ్ గతేడాది 70% తగ్గి 63.7 టన్నులగా రికార్డు అయిందని అన్నారు.

Similar News