మాజీమంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హతమార్చిన ఓం ప్రకాష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఓం ప్రకాష్ కరోనా కారణంగానే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల ఓం ప్రకాష్ మృతదేహానికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్‌గా తేలిన మరికొందరు ఖైదీలను క్వారెంటైన్ కేంద్రాలకు తరలించారు.