హైకోర్టు చివాట్లు, సుప్రీంకోర్టు అక్షింతలతో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషర్ గా నియమించింది. గురువారం అర్ధరాత్రి ఇందుకు సంబంధించిన జీఓ ను ప్రభుత్వము విడుదల చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కార్ పై సుదీర్ఘ పోరాటం అనంతరం పెద్ద విజయం సాధించారు. సీఎం జగన్ కు కూడా రాజ్యాంగ సంస్థలతో ఆటలాడితే ఏమి జరుగుతుందో నిమ్మగడ్డ ద్వారా తెలుసుకోవాలని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సీఎం జగన్ కు నచ్చలేదు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల కమిషనర్ కు ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నా జగన్ సర్కార్ ఇందులో అనవసరంగా కలగజేసుకుంది. దాంతో అప్పటి నుంచే ఆయనను తొలగించడంపైనే ఎక్కువగా దృష్టిసారించారు. ‘సంస్కరణల’ సాకుతో ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దీనివల్ల నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయింది అంటూ రమేశ్‌కుమార్‌కు తెలియజేసారు. ఈ అన్యాయంపై నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అక్కడ సంపూర్ణ న్యాయం జరిగింది.