దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 16,38,871 గా నమోదయింది. అంతేకాదు గడచిన 24 గంటలలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో 779 మంది మృతి చెందారు.
గురువారం ఒక్కరోజు దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారు 37,223 గా ఉన్నారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 10,57,806 గ ఉంటే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు సంఖ్య 5,45,318 గా ఉంది. కాగా దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 64.54 శాతంగా నమోదయింది.