నోయిడాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. నోయిడాలోని సెక్టార్ 11లో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఐదుగురిని శిధిలాల నుంచి బయటకు తీసుకువచ్చారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం నిర్మాణ దశలోనే కూలిపోయింది. 10 మందికి పైగా కార్మికులు శిధిలాల కింద ఉన్నారని తెలుస్తోంది.