కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ.. మహమ్మారి ఏమాత్రం కట్టడి కావటం లేదు. యూపీలో రోజురోజుకు కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో యూపీలో 4,453 కరోనా కేసులు నమోదయ్యాయని యూపీ ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 85,261కి చేరింది. అటు, కరోనా మరణాలు కూడా బారీగా నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే కరోనాతో 43 మంది మృతి చెందారు.