24 గంటల్లో 232 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

Update: 2020-08-01 14:08 GMT

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో మరో 232 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనా కారణంగా మరొకరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాబారిన పడి మరణించిన పోలీసుల సంఖ్య 103కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన పోలీసు సిబ్బంది సంఖ్య 9449కు పెరిగింది. ఇప్పటి వరకు 7,414 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,932 యాక్టివ్‌ కేసులున్నాయి.

Similar News