త‌మిళ‌నాడులో పోలీసుల‌కు కరోనా.. పోలీస్‌స్టేష‌న్ మూసివేత‌

Update: 2020-07-31 19:49 GMT

త‌మిళ‌నాడులో క‌రోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. త‌మిళ‌నాడు పోలీసు శాఖలో కరోనా కలవర పెడుతోంది. తాజాగా తిరుచులి పోలీస్‌స్టేష‌న్‌లో ఐదుగురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ పోలీస్‌స్టేష‌న్‌ను పూర్తిగా మూసివేశారు. క‌రోనా బారినప‌డ్డ పోలీసులను హాస్పిటల్‌కి త‌ర‌లించారు. వారితో క‌లిసి ప‌నిచేసిన మిగ‌తా పోలీసులను హోమ్ క్వారెంటైన్‌లో ఉంచినట్లు.. త‌మిళ‌నాడు పోలీస్‌శాఖ తెలిపింది.

Similar News