కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడిగా రాష్ర్ట సీఎం యోడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియామకం అయ్యారు. ఈ మేరకు కర్ణాటక రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. విజయేంద్రతో పాటు మరో 9 మంది ఉపాధ్యక్షులను నలిన్ కుమార్ నియమించారు . ఉపాధ్యక్షులతో పాటు నలుగురు జనరల్ సెక్రటరీలు, 10 సెక్రటరీలు, ఇద్దరు కోశాధికారులను నియమించారు.